Friday, July 18, 2008

తెలుగు సినిమా గురించి ....

నేను ఒక సగటు తెలుగుసినిమా ప్రేక్షకుడిని ..... బహుశా మీలాగే.
ఇన్నేళ్ళ నా సినిమా చూసిన అనుభవం తో నేను కొన్ని విషయాలు ఈ సినిమా గురించి చెప్పగలను అని అనిపించి ఈ ఆర్టికల్ రాస్తున్నాను.
నేను చూసిన అన్ని సినిమాలలో చాలా తక్కువ సినిమాలు ఫార్ములా కి భిన్నం గా ఉంటాయి.
ఇప్పుడు మీరు ఈ ఫార్ములా అంటే ఏమిటి అని అడగచ్చు. ఇప్పుడు నేను ఆ విషయానికే వస్తున్నా!!
ఈ ఫార్ములాలు రెండు రకాలు ఒకటి పెద్ద హీరో తో రెండోది చిన్న హీరో లేదా చాలా మంది కామెడిఇయన్లతో ...
ఫార్ములా 1:
ఇది జనరల్ గా పెద్ద హీరో అంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలతో ( ఈ మధ్య మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్.టి. ఆర్. లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి)
వీళ్ళతో సినిమా తీయాలి అంటే డైరెక్టర్ చాలా ముందు జాగర్తలు తీసుకోవాలి. మాస్ నే ఆకట్టుకోవడం వీరికి ముఖ్యం ఎందుకంటే వీళ్ళు ముందు సినిమా స్టొరీ కంటే హీరో క్యారెక్టర్ కి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనేది చూస్తారు. అంతే కాదు వీళ్ళ సినిమా లో మినిమం రెండు ఫైట్స్ ఉండాలి. హీరోయిన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉండాలి. హీరో ని సినిమాలో కూడా ఎవరు తిట్ట కూడదు, దెబ్బ తగల కూడదు ఇంక ఎన్నో......... రెండు చేస్లు ఉండాలి. పెద్ద హంగామా తో ఆడియో రిలీజ్, అంత కంటే ఎక్కువ హుంగమ తో సినిమ రిలీజ్ అవుతాయి.
సో ఫార్ములా చాలా ఈజీ ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకుని దాన్ని పెద్దది చేసి దానికి ఈ పాయింట్స్ అన్ని కలిపితే పెద్ద సినిమా రెడీ అయినట్లే.
కాని ఈ సినిమా కి ఏ గారంటీ ఉండదు ఎందుకంటే ప్రేక్షకులు ఈ మధ్య వీరిని తిరస్కరించే అవకాశాలు చాలా ఎక్కువ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. దీనికి పెద్ద ఉదాహరణలు లేక పోలేదు

ఫార్ములా 2:
చిన్న లేదా మధ్య తరగతి హీరో అంటే శ్రీకాంత్, జగపతిబాబు, అల్లరి నరేష్, శివాజీ, రాజా,వేణు...లాంటి వాళ్లు.
వీళ్ళ సినిమా హిట్ అవ్వాలి అంటే డైరెక్టర్ మంచి కధ, కధనం ఉన్న సబ్జెక్టు ఎంచుకో వాలి. మంచి దిఅలోగ్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాల్లో జాగర్త పడాలి. అంతే కాదు డైరెక్టర్ దీనికి చాలా బాధ్యుడు. సినిమా ఫ్లాప్ ఐతే డైరెక్టర్ దే బాధ్యత. వీళ్ళు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, రిలేషన్స్ షిప్స్ వీటిని పండించి ప్రేక్షకుల మెప్పు పొందుతారు.

ఈ రెండు ఫార్ములాలు కాకుండా ఈ మధ్య కొత్తగా ఇంకో రకం దర్శకులు ముందుకు వచ్చారు, వీళ్ళు మన తెలుగు సినిమా లో కొత్తదనం చూపించటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ద్రుష్టి అంతా కొత్త కాన్సెప్ట్స్ మీదే. ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వటం వల్ల మనకి కొత్త హీరోస్ కొత్త నటులు, హాస్య నటులు పరిచయం అవుతున్నారు ఇది ఒక మంచి పరిణామం గా చెప్పవచ్చు. ఈ ట్రెండ్ కి నమూనాలు
- ఆనంద్ - ఒక మంచి కాఫీ లాంటి సినిమా
- ఐతే - అన్ని సినిమాలు ఒకేలా ఉండవు

ఇది కాకుండా కొత్తగా కమెడియన్ హీరోలు కూడా ఒక రకం ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది మన కృష్ణా రెడ్డి ఆనిచెప్పచు. ఆయన అలీ ని హీరో చేసి తీసిన యమలీల సూపర్ హిట్ అవ్వడం ఈ ట్రెండ్ ని శ్రుస్తించింది ఆని నా నమ్మకం. ఆ తర్వాత చాలమంది ఈ ట్రెండ్ ని ఫాలో అయ్యి చాలా సినిమాలు చేసారు ఈ మధ్య వచ్చిన అందాల రాముడు దీనికి నిదర్సనం.
ఇలా మన తెలుగు సినిమా లో ఎన్నో మార్పులు జరుగుతున్నై. నేను ఐతే ఈ మార్పుని ఎంజాయ్ చేస్తున్న.
మీరు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తూ.....

- రవికిరణ్ -




2 comments:

  1. meeru choose untaaru... telugu cinamaallo heroines... okate cinema.. malli rendo cinemaki no chance..

    Daani raatha baagunte inko cinema..anthe.. malli kanapadadhu..

    Inka paatha heroines daggariki vosthe.. inka mana uniki industry lonchi pothondhi anukunnappudu.. edo oka TV channel vaallaki dabbulu ichi.. oka reality show ki guest gaa vosthaaru... Eg., Malavika and Meena - supr dancer in Gemini..

    Elaagu reality shows gurinchi anukunnam kaabatti.. request to RaviKiran (my bava) .. to scribble abt that also..

    ReplyDelete
  2. Hi Gani,
    I think you are right and I already have a blog for the stupid anchoring.
    Please read this. and thanks for your comments.
    http://ravikiran-blog.blogspot.com/2008/06/stupid-anchoring-in-shows.html

    ReplyDelete

About Me

My photo
Bangalore, Karnataka, India
Programming today is a race between software engineers striving to build bigger and better idiot-proof programs, and the Universe trying to produce bigger and better idiots. So far, the Universe is winning. I am a proud participant of this Race !!!!