నేను మొన్న సంక్రాంతి సెలవులకి అంటే ఆఫీసు కి సెలవు పెట్టి ఇంటికి రాజమండ్రి వెళ్లి నప్పుడు గోదారి గట్టుకి వెళ్లి కొంచెం సేపు సేదతీరే ప్రయత్నం చేశాను ఎందుకంటే ఈ బెంగలూరు మహా గ్రామం లో అలంటి అవకాసం లేదు కనక మా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమె అది సాధ్యం. కాని ఈ సారి ఎందుకో నాకు శేకర్ కమ్ముల తీసిన గోదావరి సినిమా గుర్తొచ్చి మనం కూడా ఓ లాంచీ ఎక్కి ఓ రోజంతా గోదావరి మీద గడిపితే ఎలా ఉంటుందో అని వెంటనే టికెట్స్ బుక్ చేసాను.
ఈ లాంచీ ప్రయాణం ఒక మంచి అనుభూతిని ఇట్చింది మా అందరికి. ఈ ప్రయాణం లో ఈ మధ్య చాల రకాల ప్యాకజీలు ఉన్నాయ్. ముఖ్యంగా ఒక రోజు లేదా రెండు రోజులు ప్యాకజీలు ఉంటై. ఒకరోజు అంటే పొద్దుట ఏడు గంటలకి బస్సు లో రాజమండ్రి నుంచి తీసుకు వెళ్లి బోటు ఎక్కిస్తారు ఇది నీటి మట్టాన్ని బట్టి రాజమండ్రి లేదా పట్టిసీమ లేదా పురుషోత్త పట్నం నుంచి ఈ ప్రయాణం మొదలవు తుంది.
అక్కడినుంచి బోటు ఎక్కగానే టిఫిన్ ఏర్పాట్లు ఉంటై. ఈ లోపు మీరు పట్టిసీమ దాటి గండి పోచమ్మ గుడికి చేరిపోతారు. ఇప్పటి వరకు మీరు చుసిన సుందర దృశ్యాలు, కొండలు, గోదావరి వంపులు ... ఇవన్ని మిమ్మల్ని ఆకట్టు కుంటాయి.
కాని మీరు ముందు చూడబోయే పాపి కొండల ముందు ఇవన్ని దిగదుడుపే అని నేను ఖత్చ్చితంగా చెప్పగలను.
ఈ గండి పోచమ్మ ని దర్శించు కుని మీరు తిరిగి వచ్చకా మల్లి మన ప్రయాణం మొదలు అవుతుంది. ఆ తర్వాత ఓ అరగంట తర్వాత మీకు అసలు పాపి కొండలు దర్సనం ఇస్తాయి. వీటిని గుర్తించడం ఎలా అనుకుంటున్నారా గోదావరి వెడల్పు ఒక కిలోమీటర్ నుంచి వంద మీటర్లుకి తగ్గిపోయి మూడు వందల అడుగులు లోతు ఉంటుంది. మీరు వచ్చిన దారివైపు చుస్తే మీకు కొండలు తప్ప గోదావరి కనపడదు. అవక్కవద్దు, అంటే గోదావరి అన్ని మలుపులు తిరుగుతుంది కనుక మీకు వెనుక పక్క దూరంగా కొండలు మాత్రమే కనపడుతాయి.
ఇది మాత్రం మీకు ఈ అద్భుతంగ అనిపిస్తుంది. అది నిజం గ చూడవలసిన దృశ్యం. ఇది ఎవరు ఎవరికీ నోటితో చెప్పలేని అనుభూతి. మీరు చూసి అనుభవించ వలసిన్దే.
No comments:
Post a Comment