Monday, August 31, 2009

తప్పు చేద్దాం రండి ...!

మొన్న వినాయక చవితి కి ఇంటికి అంటే అదేనండి మా రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తునప్పుడు స్టేషన్ లో ట్రైన్ కోసం వెయిటింగ్ లో ఉండగా బుక్ స్టాల్ లోకి ఓ లుక్ వేస్తె "తప్పు చేద్దాం రండి ...!" అనే పేరు కనపడింది.
పేరు చూసి ఇదేదో కొంచెం ఇంటెరెస్టింగ్ గా ఉంది కదా అనుకుంటూ చేతిలోకి తీసుకుంటే "యండమూరి వీరేంద్రనాథ్" అని ఉంది, చాల రోజుల క్రితం "ప్రేమ" అనే నవల చదివిన గుర్తు.
అలా కొని చదవడం ప్రారంభించిన పుస్తకం ఈ రోజు పూర్తి చెయ్యగలిగాను.
మార్పు మీద ("చేన్జి మానేజ్మెంట్") మీద ఇదివరకు చాల పుస్తకాలు వచ్చాయి నేను కూడా ఒకటి రెండు చదివాను. వాటిలో నాకు చాల నచ్చిన పుస్తకం "Who moved my Cheese".
కాని ఆ పుస్తకాలన్నిటి కి భిన్నంగా ఈ పుస్తకం ఉంది అని ఖచ్చితం గ చెప్పగలను. దానికి కారణం ఒక కధ ని సూటిగా చెప్పేస్తే కధ బాగుంది అనుకుంటాం కాని దీనిలో చాల కధలు ముఖ్య కధకు జోడించి అంతర్లీనం గ ఒకో అంశాన్ని విశ్లేసిస్తూ చెప్పిన విధానం నాకు చాల నచ్చింది. ఆ చిన్న కధల్లో చాల మటుకు ఇంటర్నెట్ లో మెయిల్స్ రూపం లో మనకు తెలిసినవే ఐన వాటిని మనం ఏ విధం గ మన జీవితానికి అన్వించు కోవాలో ఏ కధ మన లోని ఏ పాయింట్ ని వెలికి తీస్తుందో మనం ఎప్పుడు ఆలోచించని విధం గ రాసిన విధం చాల బాగుంది.
ముఖ్యం గ అతడు చెప్పా దల్చుకున్న విషయం ఏమిటి అంటే ప్రతీది కొత్తగ ఆలోచించు అని.
అలా ఎవరో ఆలోచించడం వల్లే ఈ రోజు నేను ఈ బ్లాగ్ హయిగా తెలుగు లో రాయగలుగుతున్నా.
కానీ మొదట అలా ఆలోచించడం తప్పు అని అందరు అంటారు, తర్వాత అలా అన్నవారే దాన్ని (తప్పు )ని అంగీకరిస్తారు.
అదే యండమూరి మాటల్లో
- "మార్పు ముందుగ యెగతాళి చెయ్యబడుతుంది, తర్వాత విమర్సిన్చబడుతుంది ఆ పై వ్యతిరేకిన్చబడుతుంది. చివరిగా ఒప్పుకోబడుతుంది. "
మరి కొన్ని
* మలుపు తిరగడానికి కరెక్ట్ ప్లేస్ - Dead-End 'అంతే ఐపోయింది. ఇంకేం లేదు' అనుకున్న చోట ఆగిపోకు, పక్కకు తిరుగు. మరో దారి కనపడుతుంది.
* ప్రతి మనిషి విజయము అతడి నీతీ, నిజాయితీ మీద ఆధార పది ఉంటుంది... అంటే... అవి యెంత వరకు కావాలి అని కాదు. చట్టానికి లోబడి, వాటిని యెంత వరకు విడిచి పెట్టవచ్చో తెలుసుకోవటం మీద ...
* అందరు మూర్ఖులుగా మారి ఒకడు మారక పొతే సమస్య. ఒకడు తొందరగా మారి మిగత వారు మారక పొతే ఇంక పెద్ద సమస్య.
* Pigs Don't know that Pigs Stink.
* అవకాసం తలుపు తట్టటం లేదు అని ఏడవకు. ముందు నీ గది కి తలుపు ఉందొ లేదో చూసుకో.
* నీ మీద నీడ పడుతోంది అంటే ఎక్కడో లైట్ వేలుగుతోందన్నమాట.
* వాదన వల్ల గెలుపు రాదు, చేతల వల్ల వస్తుంది. వాదన వల్ల కేవలం గొడవలు వస్తాయి.
* ఒక మనిషి గెలవటానికి వంద సూత్రాలు కావాలి. అందులో అన్నిటి కన్నా మొదటిది తనని తాను తెలుసుకోవడం. మిగత 99 అంతగా ప్రాముఖ్యం లేనివే .
ఇలాంటి లైన్లు ఈ పుస్తకం లో చాలానే ఉన్నాయ్. వీటికన్నా నాకు ఇందులో చెప్పిన చిన్న కధలు కొన్ని బాగా నచ్చాయి.
ఈ పుస్తకం ఒకసారి తప్పని సరిగా చదవ వలసిన పుస్తకం. ఇది మీలో అంత మార్పు రాకపోఇన ఇది ఒక మామూలు నవల గ టైం పాస్ కోసం ఐన చదవచ్చు.

ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

No comments:

Post a Comment

About Me

My photo
Bangalore, Karnataka, India
Programming today is a race between software engineers striving to build bigger and better idiot-proof programs, and the Universe trying to produce bigger and better idiots. So far, the Universe is winning. I am a proud participant of this Race !!!!