Showing posts with label తెలుగు బ్లాగ్. Show all posts
Showing posts with label తెలుగు బ్లాగ్. Show all posts

Tuesday, August 17, 2010

తెలుగు సినిమా డైలాగు !!!


ఎవరో ఓ కవి వర్యుడు చెప్పినట్టు 
"కుట్టిన కొద్ది చిరిగే లాగు ? 
తెలుగు సినిమా డైలాగు !!! "

కాని మనకు ఎన్నో సినిమా డైలాగ్స్ మర్చిపోలేని ముద్ర వేసాయి. వాటిలో కొన్ని నాకు నచ్చిన డైలాగులు ..... మీ కోసం. 

 రావు గోపాల రావు విలనిజానికి కొత్త అర్ధం చెప్పిన విలన్. 
ముత్యాల ముగ్గు 
- చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చిమ్పేస్తే చిరిగిపోదు. 
- సెగట్రీ, ఆకాశం లో మర్డర్ జరిగినట్టు లేదూ, సూర్యుడు చూడు ఎర్రగా ఎలా ఉన్నడో? 
- మడిసి అన్నాక కుసింత కలాపోసన ఉండాల
- సినేమా కతలు చెప్పద్దు, డిక్కీలో తోన్గో పెట్టేస్తాను. 

బ్రహ్మానందం పేరు వింటేనే తెలుగు సినీ ప్రేక్షకులు ముఖములలో నవ్వులు.

- ఖాన్ తొ గేమ్స్ ఆడద్దు , సాల్తిలు లేచిపోతై !!!

- వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ !!!
- నీళ్ళు అంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే .... అందుకే వంతెన కట్టేరు. 
- జాక్సన్ మైక్హెల్ జాక్సన్ !!!
- పెన్ అనుకున్నవా గన్ను !!! 


ఎస్విఆర్ - నటనకి మరో రూపం అది విలన్ కాని క్యారెక్టర్ రోల్ కాని ... ఎస్వీఆర్ నెం. 1
- సాహసం సేయరా డింభకా, రాకుమారి దక్కుతుంది !!!
- గెడ్డం తీసివేసినానే బుల్ బుల్ !!! చెంత చేరవే బుల్ బుల్ !!!
- అదే అదే (మానరిజం ఇన్ మిస్సమ్మ )


మరి కొన్ని ........ ..
సినిమాలు  చూడటం లేదేంటి ?

నేను చెట్టును నమ్ముతాను కాయని నమ్మను, చెట్టు మంచిది ఐతే కాయ ఆటోమాటిక్ గా మంచిది అవుతుంది.
ఉల్లి పాయలు కోసిన వాడికి కన్నీళ్ళు ఊరి నుంచి వచ్చిన వాడికి కన్నీళ్లు తప్పదు.
మీరు ఓటు వేసిన వాడు మంత్రి, కాదు అన్నవాడు కంత్రి !!!
కాస్కో నా వాస్కోడిగామా మరో స్వతంత్ర పోరాటం.
ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని ...ఎంత ఇష్టమో చెప్పగలను. 

Related Links :

నా తెలుగు రాతలు !!!

నవ్వుల వాక్యాలు ...మీ కోసం  


మీరు మందు మానేద్దాం అనుకుంటున్నారా ?

Monday, March 29, 2010

నా దారి గోదారి - పాపి కొండలు !!!



నేను మొన్న సంక్రాంతి సెలవులకి అంటే ఆఫీసు కి సెలవు పెట్టి ఇంటికి రాజమండ్రి వెళ్లి నప్పుడు గోదారి గట్టుకి వెళ్లి కొంచెం సేపు సేదతీరే ప్రయత్నం చేశాను ఎందుకంటే బెంగలూరు మహా గ్రామం లో అలంటి అవకాసం లేదు కనక మా ఊరు వెళ్ళినప్పుడు మాత్రమె అది సాధ్యం. కాని సారి ఎందుకో నాకు శేకర్ కమ్ముల తీసిన గోదావరి సినిమా గుర్తొచ్చి మనం కూడా లాంచీ ఎక్కి రోజంతా గోదావరి మీద గడిపితే ఎలా ఉంటుందో అని వెంటనే టికెట్స్ బుక్ చేసాను.


లాంచీ ప్రయాణం ఒక మంచి అనుభూతిని ఇట్చింది మా అందరికి. ప్రయాణం లో మధ్య చాల రకాల ప్యాకజీలు ఉన్నాయ్. ముఖ్యంగా ఒక రోజు లేదా రెండు రోజులు ప్యాకజీలు ఉంటై. ఒకరోజు అంటే పొద్దుట ఏడు గంటలకి బస్సు లో రాజమండ్రి నుంచి తీసుకు వెళ్లి బోటు ఎక్కిస్తారు ఇది నీటి మట్టాన్ని బట్టి రాజమండ్రి లేదా పట్టిసీమ లేదా పురుషోత్త పట్నం నుంచి ప్రయాణం మొదలవు తుంది.
అక్కడినుంచి బోటు ఎక్కగానే టిఫిన్ ఏర్పాట్లు ఉంటై. లోపు మీరు పట్టిసీమ దాటి గండి పోచమ్మ గుడికి చేరిపోతారు. ఇప్పటి వరకు మీరు చుసిన సుందర దృశ్యాలు, కొండలు, గోదావరి వంపులు ... ఇవన్ని మిమ్మల్ని ఆకట్టు కుంటాయి.

కాని మీరు ముందు చూడబోయే పాపి కొండల ముందు ఇవన్ని దిగదుడుపే అని నేను ఖత్చ్చితంగా చెప్పగలను.


గండి పోచమ్మ ని దర్శించు కుని మీరు తిరిగి వచ్చకా మల్లి మన ప్రయాణం మొదలు అవుతుంది. తర్వాత అరగంట తర్వాత మీకు అసలు పాపి కొండలు దర్సనం ఇస్తాయి. వీటిని గుర్తించడం ఎలా అనుకుంటున్నారా గోదావరి వెడల్పు ఒక కిలోమీటర్ నుంచి వంద మీటర్లుకి తగ్గిపోయి మూడు వందల అడుగులు లోతు ఉంటుంది. మీరు చ్చిన దారివైపు చుస్తే మీకు కొండలు తప్ప గోదావరి కనపడదు. అవక్కవద్దు, అంటే గోదావరి న్ని మలుపులు తిరుగుతుంది కనుక మీకు వెనుక పక్క దూరంగా కొండలు మాత్రమే కనపడుతాయి.
ఇది మాత్రం మీకు అద్భుతంగ అనిపిస్తుంది. అది నిజం చూడవలసిన దృశ్యం. ఇది ఎవరు ఎవరికీ నోటితో చెప్పలేని అనుభూతి. మీరు చూసి అనుభవించ లసిన్దే.

About Me

My photo
Bangalore, Karnataka, India
Programming today is a race between software engineers striving to build bigger and better idiot-proof programs, and the Universe trying to produce bigger and better idiots. So far, the Universe is winning. I am a proud participant of this Race !!!!